హీరోయిన్ విషయంలో ఆలోచనలో పడిన నిఖిల్ టీమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్ విషయంలో ఆలోచనలో పడిన నిఖిల్ టీమ్

  • 'కణితన్' రీమేక్ కి సన్నాహాలు 
  • కేథరిన్ ను తీసుకునే ఆలోచన లేనట్టే 
  • మరో ఇద్దరు కథానాయికలతో సంప్రదింపులు
'కిరాక్ పార్టీ'తో త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోన్న నిఖిల్, తదుపరి చిత్రంగా 'కణితన్' రీమేక్ చేయనున్నాడు. తమిళం'లో ఈ సినిమా హిట్ కొట్టడంతో, అదే దర్శకుడితో రీమేక్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా కేథరిన్ ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావించారు. నిఖిల్ కూడా అందుకు ఓకే చెప్పాడు.

 అయితే నిఖిల్ జోడీగా కేథరిన్ సెట్ కాదనే ఫీడ్ బ్యాక్ రావడంతో, హీరోతోపాటు దర్శక నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారు. కేథరిన్ విషయం పక్కన పెట్టేయాలనే నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం నాగచైతన్య జోడీగా 'సవ్యసాచి' చేస్తోన్న నిధి అగర్వాల్ ను గానీ, నితిన్ సరసన 'లై' చేసిన మేఘా ఆకాశ్ ను గాని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట. ముందుగా నిధి అగర్వాల్ ను సంప్రదించి, ఆమె కుదరదంటే మేఘా ఆకాశ్ ను అడగాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు సెట్ అవుతారనేది చూడాలి.    
nikhil
nidhi agarwal

More Telugu News