కంగన 'మణికర్ణిక' రిలీజ్‌కు అడ్డంకులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంగన 'మణికర్ణిక' రిలీజ్‌కు అడ్డంకులు!

  • ఆగస్టు 3 నుండి మరోసారి వాయిదా పడే ఛాన్స్
  • లక్ష్మీభాయ్ పాత్రను వక్రీకరించారని బ్రాహ్మణుల వార్నింగ్
  • తాంతియా తోపీగా అతుల్, సదాశివ్‌గా సోనూసూద్
దీపికా పదుకునే ప్రధాన పాత్రలో నటించిన 'పద్మావత్' చిత్రం అనేక అడ్డంకులను ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలయింది. ఇపుడు కంగనా రనౌత్ నటిస్తున్న 'మణికర్ణిక' చిత్రం వంతొచ్చినట్లుంది. ఆ సినిమా విడుదలకు కూడా అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఓ బ్రాహ్మణ వర్గం ఈ సినిమా షూటింగ్‌ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇవ్వడంతో అనుకున్న సమయానికి ఇది రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. బ్రాహ్మణ కులానికి చెందిన వీర నారి రాణి లక్ష్మీభాయ్ పాత్రను ఇందులో అనుచితమైన రీతిలో చిత్రీకరించారని ఆ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

తొలుత దీనిని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. రిలీజ్ తేదీ కాస్త ఆగస్టు 3కు వాయిదా పడింది. కానీ, బ్రాహ్మణుల తాజా హెచ్చరిక నేపథ్యంలో చిత్ర నిర్మాతలు కమల్ జైన్, జీ స్టూడియోస్ రిలీజ్ తేదీని మరోసారి వాయిదా వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను కంగనా రనౌత్ పోషించగా..అతుల్ కులకర్ణి తాంతియా తోపీ పాత్రను, సదాశివ్ పాత్రను సోనూసూద్, ఝల్‌కరిభాయ్ పాత్రను అంకిత లోకందే పోషిస్తున్నారు.
Kangana Ranaut
Manikarnika
Kamal Jain
Sonu Sood

More Telugu News