దేవుళ్ల పాత్రలకు నేను సెట్ అవుతానని ఎవరూ అనుకోలేదు: సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేవుళ్ల పాత్రలకు నేను సెట్ అవుతానని ఎవరూ అనుకోలేదు: సుమన్

  • హీరోగా సంతృప్తికరంగా కెరియర్ కొనసాగింది 
  • క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నాను
  • నేను చేయవలసిన పాత్రలు మరికొన్ని వున్నాయి
తెలుగు తెరపై యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన సుమన్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించారు. తెలుగులోని అగ్ర కథానాయకులలో ఒకరిగా సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు.

 "హీరోగా నా జర్నీ చాలా బాగా జరిగింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలను చేస్తూ వస్తున్నాను. 'శివాజీ' సినిమాలో నేను చేసిన విలన్ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 'అన్నమయ్య' .. 'శ్రీరామదాసు' .. 'శ్రీ సత్యనారాయణ స్వామి' సినిమాలు దేవుడి పాత్రల్లోను నేను మెప్పించగలను అనే విషయాన్ని నిరూపించాయి. ఇలాంటి విభిన్నమైన పాత్రలను చేస్తానని నేనే ఊహించలేదు. 'అన్నమయ్య'లో వేంకటేశ్వర స్వామిగా చేసేంతవరకూ నేను దేవుడి పాత్రలకి సెట్ అవుతానని ఎవరూ అనుకోలేదు. అలాగే నేను కొత్తగా చేయవలసిన పాత్రలు కొన్ని వున్నాయి" అంటూ చెప్పుకొచ్చారు.   
suman

More Telugu News