నాకు ఒక అమ్మాయి దొరికింది: ఆసక్తి కలిగిస్తున్న సల్మాన్ ఖాన్ ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఒక అమ్మాయి దొరికింది: ఆసక్తి కలిగిస్తున్న సల్మాన్ ఖాన్ ట్వీట్

  • ఆసక్తికరంగా మారిన సల్మాన్ ట్వీట్
  • పెళ్లి గురించేనా ఈ ట్వీట్ అంటూ సర్వత్ర సందేహం
  • 'రేస్ 3' సినిమాలో నటిస్తున్న సల్మాన్
యాభై ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖానే. సల్మాన్ కు సంబంధించిన ఎలాంటి చిన్న వార్త అయినా పతాక శీర్షికల్లోనే ఉంటుంది. తాజాగా ఓ ట్వీట్ ద్వారా సల్మాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. 'నాకు ఒక అమ్మాయి దొరికింది' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సల్మాన్ పెళ్లికి సంబంధించిందేనా? అనే ఆసక్తి ఇప్పుడు అందర్లో నెలకొంది.

గత కొంతకాలంగా లులియా వాంటూర్ తో సల్మాన్ సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు కూడా ఇటీవల వినిపించాయి. 'సల్మాన్ తనకు మంచి మిత్రుడు మాత్రమే' అని లులియా కామెంట్ చేయడంతో... ఇద్దరూ ఒకరికొకరు దూరం జరిగారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సల్మాన్ చేసిన ట్వీట్ తో... అతని పెళ్లి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రెమో డిసౌజా దర్శకత్వంలో సల్మాన్ 'రేస్ 3' సినిమా చేస్తున్నాడు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Salman Khan
bollywood
marriage

More Telugu News