'పద్మావత్' స్టార్ల మధ్య మాటల తూటాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పద్మావత్' స్టార్ల మధ్య మాటల తూటాలు!

  • పద్మావత్‌లో రణ్‌వీర్ పాత్రపై షాహీద్
  • షాహీద్ కమీనే సిన్మాపై రణ్‌వీర్ కామెంట్లు
  • ఇలాంటి కామెంట్లు వలదంటూ బాలీవుడ్ హితవు
వివాదాల నడుమ రిలీజయిన పద్మావత్ సినిమాలో నటించిన స్టార్ హీరోలు షాహీద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌ల మధ్య మాటల తూటాలు పేలాయి. వారిద్దరూ ఆ సినిమాలో ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు నటించారు. కానీ ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి తొలుత రణ్‌వీర్ సింగ్ తెరదీశాడు. షాహీద్ నటించిన 'కమీనే' చిత్రాన్ని ఒకవేళ తాను గనుక చేసుంటే అతని కంటే గొప్పగా నటించి ఉండే వాడినని రణ్‌వీర్ కామెంట్ చేశాడు.

 తనపై చేసిన కామెంట్‌ను షాహీద్ అదే స్థాయిలో తిప్పికొట్టాడు. పద్మావత్‌లో రణ్‌వీర్ చేసిన ఖిల్జీ పాత్రను తానైతే అతని కంటే విలక్షణమైన రీతిలో పోషించి ఉండే వాడినని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు స్టార్ల కామెంట్ల కల్లోలం గురించి తెలుసుకున్న పద్మావత్ సినిమా టీమ్ సభ్యుడొకరు దీనికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

"ప్రతి నటుడు ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు తనలోని మొత్తం టాలెంట్‌ను బయటకు తీసుకొస్తాడు. దిలీప్ కుమార్ దేవదాస్ చిత్రాన్ని షారూఖ్ చేసిన దేవదాస్‌తో కంపేర్ చేయరాదు. నమక్ హారామ్ సినిమాలో రాజేష్ ఖన్నా పాత్రను తానైతే అలా పోషించి ఉండేవాడిని..ఇలా పోషించి ఉండేవాడినని అమితాబ్ కామెంట్ చేశారా? లేదు కదా! అందువల్ల ఒకే చిత్రంలో నటించిన ఇద్దరు యాక్టర్లు తమ రోల్స్ గురించి కామెంట్ చేసుకోవడం తగదు" అంటూ ఆయన హితవు చెప్పారు.

 పద్మావత్ చిత్రం షూటింగ్ జరుగుతున్నంత కాలం రణ్‌వీర్ పాత్రపై షాహీద్‌ కన్నేశాడు. అంతేకాక ఆ పాత్రకు రణ్‌వీర్ సరిగా న్యాయం చేస్తాడా?లేదా? అనే డౌట్ కూడా చివరి వరకు షాహీద్‌కు ఉండేదని మరో టీమ్ సభ్యుడు చెప్పుకొచ్చారు. ఏదేమైనా... వారిద్దరూ ఇలాంటి విమర్శలు పక్కనపెట్టి హుందాగా ముందుకు సాగాలని బాలీవుడ్‌ జనాలు ఆశిస్తున్నారు.
Shahid
Ranveer
Padmavat

More Telugu News