చెన్నంపల్లి కోటలో బయటపడిన ఆయుధాగారం!

దాదాపు 20 రోజుల విరామం తరువాత కర్నూలు జిల్లా చెన్నంపల్లిలోని గుత్తిరాజుల కోటలో రెండో రోజు తవ్వకాల్లో ఆనాటి ఆయుధాగారం వెలుగులోకి వచ్చింది. తవ్వకాలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఫిరంగులు, ఫిరంగి గుండ్లను కనుగొన్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో కత్తులు తదితరాలు కూడా బయటపడిన నేపథ్యంలో, తామిప్పుడు ఆయుధాగారం సమీపంలో ఉన్నామని భావిస్తున్నామని, తవ్వకాలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇక్కడ భారీ నిధి ఉందన్న ప్రచారం ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న సంగతి తెలిసిందే. పురావస్తు శాఖ అధికారులు, పోలీసులు, మైనింగ్ విభాగాలు కలిసి ఈ కోటలో తవ్వకాలు సాగిస్తుండగా, ఇక్కడ నిధి కోసం తాము తవ్వకాలు చేపట్టలేదని, విలువైన ఖనిజాలు ఉన్నాయన్న కోణంలోనే తవ్వకాలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Karnool Dist
Chennampalli
Gutti Dynasty
Fort
Treasure

More Telugu News