అమరావతిలో 108 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. నాలుగు ఆకృతులను పరిశీలించిన చంద్రబాబు
- నీరుకొండపైన రాజధానికి అభిముఖంగా ఏర్పాటు
- వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి పూర్తిస్థాయి ఆకృతులను సిద్ధం చేయాలని ఆదేశం
- కొండపై ఎన్టీఆర్ స్మారక కేంద్రం, ప్రదర్శనశాల
ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత కృష్ణా నది ఒడ్డున కోర్ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడా నిర్ణయాన్ని విరమించుకుని నీరుకొండ వైపు ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో తీర్మానించారు. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండడంతో విగ్రహం నీడ నీటిలో ప్రతిబింబించనుంది.