షూటింగ్ చివరి రోజున అందరం ఏడ్చేశాం: నిఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటింగ్ చివరి రోజున అందరం ఏడ్చేశాం: నిఖిల్

  • నిఖిల్ హీరోగా 'కిరాక్ పార్టీ'
  • ఈ మూవీ చూస్తే కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి
  • కంటెంట్ కదిలించి వేస్తుంది  
తెరపై తాను కనిపిస్తున్నంత సేపు సందడి చేసే హీరో నిఖిల్. ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన పాత్రలను చేస్తూ, వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కిరాక్ పార్టీ' రెడీ అవుతోంది.

కాలేజ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను గురించి నిఖిల్ మాట్లాడుతూ, 'జయం' .. 'నువ్వు నేను' సినిమాలు కాలేజ్ ఎగ్గొట్టి మరీ చూశాము. ఇక కాలేజ్ నేపథ్యంలో 'హ్యాపీ డేస్' చేయడం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చింది. మళ్లీ ఇంతకాలానికి కాలేజ్ నేపథ్యంలో సాగే 'కిరాక్ పార్టీ' చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది.

ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికీ వాళ్ల కాలేజ్ డేస్ గుర్తుకు వస్తాయి. ఈ సినిమా షూటింగు చివరి రోజున ఎమోషన్స్ ను ఆపుకోలేక అందరం ఏడ్చేశాం. అంతగా ఈ సినిమాలో కంటెంట్ మమ్మల్ని కదిలించింది" అంటూ చెప్పుకొచ్చాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సంయుక్త హెగ్డే కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.   
nikhil
samyukta

More Telugu News