రేపటి నుంచి నవ్యాంధ్రలో నంది నాటకోత్సవాలు!

  • రేపటి నుంచి 12వ తేదీ వరకు నాటకోత్సవాలు
  • తెనాలి, కాకినాడ, రాజమహేంద్రవరం, నంద్యాల, కర్నూలు వేదికగా ఉత్సవాలు
  • ఏప్రిల్ 16న బహుమతి ప్రదానం
ఏపీలో నంది నాటకోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీలోని ఐదు ప్రాంతాల్లో వినూత్నంగా ఈ నాటకోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెనాలి, కాకినాడ, రాజమహేంద్రవరం, నంద్యాల, కర్నూలులో ఈ నాటకోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఏపీ టెలివిజన్ చలనచిత్ర అభివృద్ధి సంస్థల ఎండీ వెంకటేశ్వరరావు తెలిపారు.

ఈ నెల 2 నుంచి 12 వరకు నంది నాటకోత్సవాలు జరుగుతాయని, తెనాలిలో మాత్రం 2 నుంచి 10వ తేదీ వరకే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నంది నాటకోత్సవాల్లో గెలుపొందిన కళాకారులకు తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 16న బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. ఈ పురస్కారాలను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు. నంది నాటకోత్సవాలను ఐదు చోట్ల నిర్వహించనుండటంపై వారు స్పందిస్తూ, ప్రజల వద్దకే వేడుకలను తీసుకెళ్లేందుకు ఇలా నిర్వహించనున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
nandi natakalu

More Telugu News