మల్టీ స్టారర్ సినిమాలకి నేను రెడీ: రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మల్టీ స్టారర్ సినిమాలకి నేను రెడీ: రవితేజ

  • హీరోలంతా నాకు మంచి స్నేహితులే 
  • వాళ్లతో కలిసి నటించడానికి అభ్యంతరం లేదు 
  • కథ .. కథనాలు బావుండాలి అంతే  
ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కాలం నుంచి మల్టీ స్టారర్ సినిమాలు వస్తూనే వున్నాయి. అయితే మధ్యలో ఇలాంటి సినిమాల జోరు కాస్త తగ్గినా, ఈ మధ్య కాలంలో మళ్లీ వాటి ఊపు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి యువ కథానాయకులు రెడీ అవుతున్నారు. ఈ తరహా సినిమాలు చేయడానికి తాను కూడా సిద్ధంగానే వున్నానని తాజాగా రవితేజ చెప్పాడు.

'దర్శకులు .. రచయితలు మంచి కథలతో రావాలి. కథ .. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉండాలి. అలాంటి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. ఇండస్ట్రీలో హీరోలంతా నాకు మంచి స్నేహితులే. ఎవరితో ఇలాంటి సినిమాలు చేయవలసి వచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు' అని చెప్పాడు. ఆయన చేసిన 'టచ్ చేసి చూడు' విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, మరో రెండు సినిమాలు చేతిలో వున్నాయి.
Raviteja

More Telugu News