నిఖిల్ సినిమాకు 'బాహుబలి' కెమెరామెన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిఖిల్ సినిమాకు 'బాహుబలి' కెమెరామెన్

  • తెలుగు రీమేక్ గా తమిళ 'కణితన్'
  • తెలుగు వెర్షన్ కి కూడా తమిళ దర్శకుడే 
  • త్వరలో సెట్స్ పైకి    
'బాహుబలి' సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించినవారి జాబితాలో మనకి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పేరు కూడా కనిపిస్తుంది. తెరపై ఆయన ఆవిష్కరించిన అద్భుతమైన దృశ్యాలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేశాయి. అలాంటి సెంథిల్ కుమార్ తాజాగా నిఖిల్ సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా సమాచారం.

 కన్నడ సినిమా రీమేక్ గా 'కిరాక్ పార్టీ' చేసిన నిఖిల్, త్వరలో తమిళ సినిమా 'కణితన్' కు రీమేక్ చేయనున్నాడు. 'కణితన్' దర్శకుడు సంతోష్ తెలుగులోనూ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ రీమేక్ కి సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఆయన రాకతో ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 
nikhil
senthil kumar

More Telugu News