గుర్తుపట్టలేకుండా ఉన్న అనుష్క శర్మ కొత్త లుక్... వైరల్ అవుతున్న ఫొటో
- చీరకట్టుతో మధ్యతరగతి మహిళగా కనిపిస్తున్న అనుష్క
- 'సూయ్ ధాగా' చిత్రంలో పాత్ర లుక్ ఇది
- ఆకట్టుకుంటున్న గెటప్
ఈ లీకయిన ఫొటోలో అనుష్క శర్మ గుర్తుపట్టలేని విధంగా ఉంది. సాధారణ మధ్యతరగతి మహిళగా చీరకట్టుతో, ఎలాంటి మేకప్ లేకుండా ఉన్న అనుష్క లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. తన మొదటి చిత్రం 'రబ్ బనే దీ జోడీ' సినిమాలో కూడా ఆమె ఇలాంటి పాత్రలోనే కనిపించింది. కానీ ఆ గెటప్‌తో పోల్చితే ఈ గెటప్ చాలా కొత్తగా ఉందని అభిమానులు అంటున్నారు.
ఏదేమైనా మరోసారి డీగ్లామరైజ్డ్ పాత్రలో అనుష్క తన విశ్వరూపం చూపించనుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాను నిర్మిస్తూ, నటిస్తున్న 'పరి' చిత్రంలో కూడా అనుష్క శర్మ సరికొత్త అవతారంలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.