పాక్ చేతికి ప్రమాదకర ఆయుధం... భారత్ ఆందోళన!
- పాక్ వద్ద 'వింగ్ లూంగ్' డ్రోన్
- 5 వేల కి.మీ వెళ్లి బాంబులేసే సత్తా
- ఇండియా వద్ద లేని ఆ తరహా డ్రోన్
రాడార్లకు చిక్కుండా తక్కువ ఎత్తులోనే వెళ్లే వీటిని కనుగొని ప్రతి దాడి చేయాలన్నా కష్టమే. సుమారు 14 మీటర్ల పొడవుండే ఈ డ్రోన్ విమానాలు ఏకధాటిగా 20 గంటల పాటు ప్రయాణం చేస్తాయి. సుమారు 200 కిలోల బరువైన బాంబులను మోసుకుంటూ వెళతాయి. తేలికపాటి మిసైల్స్ ను కూడా వీటికి అనుసంధానించి దాడులు చేయవచ్చు. చైనా వీటిని పాక్ కు అందించిందన్న సమాచారం తమ వద్ద ఉన్నదని భారత సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఈ తరహా డ్రోన్ లు ఇంకా ఇండియా సైన్యం వద్ద లేవని ఆయన అన్నారు. కాగా, చైనా వింగ్ లూంగ్ సిరీస్ లో ప్రస్తుతం నాలుగో తరం డ్రోన్ లను తయారు చేస్తోంది.