సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • రుణం తీర్చుకోలేనంటున్న అందాల రాశి 
  • బాలకృష్ణ విడుదల చేసిన మెగా హీరో టీజర్ 
  • కొత్త దర్శకుడితో డాక్టర్ రాజశేఖర్ 
  • 'అమర్ అక్బర్ ఆంథోని'గా రవితేజ  
*  తెలుగు ప్రేక్షకుల వల్లే తాను సంతోషంగా వున్నానని అంటోంది అందాల రాశిఖన్నా. "తెలుగు ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం వుండేది. అయితే, నా తొలి చిత్రం 'ఊహలు గుసగుసలాడే'ని హిట్ చేసి నా భయాన్ని పోగొట్టారు. అప్పటి నుంచీ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకే వారికి ఎప్పటికీ రుణపడి వుంటాను' అని చెప్పింది.
*  సాయి ధరం తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇంటిలిజెంట్' చిత్రం టీజర్ ను నిన్న సాయంకాలం విడుదల చేశారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం పెద్ద విశేషం.
*  'గరుడ వేగ' చిత్రం విజయంతో మళ్లీ ఊపందుకున్న ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపి అనే నూతన దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తాడు. గోపి చెప్పిన కథ బాగా నచ్చడంతో రాజశేఖర్ వెంటనే ఓకే చెప్పేశాడట.
*  గత కొన్నాళ్లుగా హిట్స్ లేక వెనుకబడిన ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తున్నాడు. రవితేజ హీరోగా నటించే ఈ చిత్రానికి 'అమర్ అక్బర్ ఆంథోని' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.  
Rashi
Balakrishna
rajashekhar
Raviteja

More Telugu News