హ్యాండ్ గ్రెనేడ్ రూపంలో ప‌వ‌ర్ బ్యాంక్‌...ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో క‌ల‌క‌లం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హ్యాండ్ గ్రెనేడ్ రూపంలో ప‌వ‌ర్ బ్యాంక్‌...ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో క‌ల‌క‌లం

  • సెక్యూరిటీ చెక్‌లో బ‌య‌ట‌ప‌డిన విష‌యం
  • ప‌వ‌ర్ బ్యాంక్ అని తేల‌డంతో విమానం ఎక్కేందుకు అనుమ‌తి
  • కాసేపు ఆందోళ‌న చెందిన సెక్యూరిటీ సిబ్బంది
హ్యాండ్ గ్రెనేడ్ రూపంలో ఉన్న ప‌వ‌ర్ బ్యాంక్ కార‌ణంగా ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు క‌ల‌క‌లం జ‌రిగింది. ఢిల్లీ నుంచి అహ్మ‌దాబాద్ వెళ్తున్న ఓ యువ‌కుడి బ్యాగ్‌లో ఈ ప‌వ‌ర్ బ్యాంక్ ఉంది. సెక్యూరిటీ చెక్‌లో భాగంగా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

హ్యాండ్ గ్రెనేడ్ రూపంలో ఉన్న ప‌వ‌ర్ బ్యాంక్‌ని గుర్తించ‌గానే సెక్యూరిటీ సిబ్బంది యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అది ప‌వ‌ర్ బ్యాంక్ అని నిర్ధారించుకుని విమానం ఎక్కేందుకు అత‌న్ని అనుమ‌తించారు. హ్యాండ్ గ్రెనేడ్ రూపంలో ఉన్న ప‌వ‌ర్ బ్యాంక్‌ని చూడ‌గానే తాము ఆందోళ‌న చెందామ‌ని, వెంట‌నే ర‌క్ష‌ణ సిబ్బందిని కూడా అప్ర‌మ‌త్తం చేసిన‌ట్లు గో ఎయిర్ ప్ర‌తినిధి తెలిపారు.
hand granade
power bank

More Telugu News