బాలకృష్ణ కూర్చున్న కుర్చీ చంద్రబాబుది కాదట.. అధికారుల వివరణ!
Add ap7am to your home Screen

బాలకృష్ణ కూర్చున్న కుర్చీ చంద్రబాబుది కాదట.. అధికారుల వివరణ!

  • సీఎం కూర్చునే సీట్లో బాలయ్య
  • నిన్న వైరల్ అయిన ఫోటోలు
  • కుర్చీ ముందే తీసేశామంటున్న సచివాలయ సిబ్బంది
  • కేవలం ప్లేస్ మాత్రమేనని వివరణ
నిన్న అమరావతిలో లేపాక్షి ఉత్సవాలపై సమీక్షను జరిపిన వేళ, హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు కుర్చీలో కూర్చున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. ఈ మీటింగ్ లో బాలయ్య కూర్చున్న కుర్చీ సీఎంది కాదని, కేవలం ఆ ప్లేస్ లో మాత్రమే ఆయన కూర్చున్నారని అధికారులు చెబుతున్నారు.

ఏపీ పరిశ్రమల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరైన సమావేశానికి ముందే, అక్కడ చంద్రబాబు కూర్చునే కుర్చీని తీసివేసి, ఆ స్థానంలో మరో కుర్చీ వేసినట్టు తెలుస్తోంది. అయితే, మీడియాకు ఎక్కిన ఫొటోల్లో బాలకృష్ణ వెనుకనున్న డిజైన్ పోస్టర్ ను చూసినవారంతా, చంద్రబాబు కూర్చునే కుర్చీలోనే ఆయన కూర్చున్నారని భావించారు.

అయితే సమావేశానికి ముందే సచివాలయం సిబ్బంది చంద్రబాబు ఉపయోగించే కుర్చీని పక్కకు జరిపారని, వేరే కుర్చీలోనే బాలకృష్ణ కూర్చున్నారని అంటున్నారు. ఏదేమైనా, సచివాలయంలోని సీఎం చాంబర్‌ లో ఈ సమీక్షను నిర్వహించడం, సీఎం కూర్చునే స్థానంలో బాలయ్య కూర్చోవడం చర్చనీయాంశమైంది.
Balakrishna
Chandrababu
Amaravati
CM Chamber
Chair

More Telugu News