సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను: పవన్ కల్యాణ్
సమాజంలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తాను రాజకీయాల్లోకి రావడానికి నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య కూడా ఓ కారణమని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... అంబేద్కర్, పూలే విధానాలతో ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. దేశంలో కులాలు అంతం కావాలని, తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయాల మార్పుపై దృష్టి సారించాలని అన్నారు. ఉడుకు నెత్తురుతో ఉన్న యువత మార్పుకోసం కలిసి రావాలని వ్యాఖ్యానించారు.