నేను ఎప్పటికీ మరిచిపోలేనిది సౌందర్యనే!: ఆమని
Add ap7am to your home Screen

నేను ఎప్పటికీ మరిచిపోలేనిది సౌందర్యనే!: ఆమని

  • రోజా, రమ్యకృష్ణలతో మంచి స్నేహం వుంది
  • సౌందర్య ఫ్యామిలీతో అనుబంధం వుంది 
  • సౌందర్య గుర్తొస్తే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు  
తెలుగులో నిన్నటి తరం కథానాయికలలో ఆమనికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. బరువైన పాత్రలను పోషించి మెప్పించిన ఆమని, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరియర్లో తన తోటి కథానాయికల గురించి ప్రస్తావిస్తూ " రోజా .. రమ్యకృష్ణ .. సౌందర్యలతో నేను ఎక్కువ స్నేహంగా ఉండేదానిని. ఇక సౌందర్య .. నేను కలిసి ఓ మూడు సినిమాల వరకూ చేయడం వలన మంచి స్నేహితులమయ్యాం.

సౌందర్య వాళ్ల ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం వుంది. తనకి ఏ మాత్రం తీరిక దొరికినా నాకు ఫోన్ చేసేది. తాను చనిపోయినప్పుడు నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. తనని కాకుండా నన్ను తీసుకెళ్లాల్సింది కదా అంటూ దేవుడిని వేడుకున్నాను. అంత మంచి నటిని ..అందమైన బొమ్మవంటి అమ్మాయిని .. మంచి స్నేహితురాలిని పోగొట్టుకున్నాను. ఇప్పటికీ గుర్తుకువస్తే నాకు కన్నీళ్లు ఆగవు" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.   
aamani

More Telugu News