‘ఐమాక్స్’ థియేటర్ పై తార్నాక వ్యక్తి ఫిర్యాదు .. నోటీసులు జారీ చేసిన హైకోర్టు!
- బిగ్ స్క్రీన్ థియేటర్ లోని సీట్ల మధ్య దారి వదలలేదు
- అత్యవసర పరిస్థితులు తలెత్తితే అక్కడి నుంచి బయటపడలేం
- హైకోర్టుకు ఓ లేఖ రాసిన తార్నాక వాసి
- ఆ లేఖను పిల్ గా స్వీకరించిన హైకోర్టు
ఈవిషయమై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా స్వీకరించింది. ఈ మేరకు ఐమాక్స్ థియేటర్ యాజమాన్యంతో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీకి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.