భావ‌న‌, న‌వీన్‌ల పెళ్లికి త‌ర‌లి వెళ్లిన మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భావ‌న‌, న‌వీన్‌ల పెళ్లికి త‌ర‌లి వెళ్లిన మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌

  • హాజ‌రైన మ‌మ్ముట్టి, పృథ్వీరాజ్‌
  • న‌‌వ్యా నాయ‌ర్‌, మంజు వారియ‌ర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌
  • వైర‌ల్ అవుతున్న పెళ్లి ఫొటోలు
న‌టి భావ‌న‌, నిర్మాత న‌వీన్‌ల పెళ్లి వేడుక‌కు మ‌ల‌యాళ చిత్ర‌సీమ త‌ర‌లి వెళ్లింది. త్రిస్సూర్‌లో సోమ‌వారం జ‌రిగిన వీరి వివాహానికి మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన అతిర‌థ‌మ‌హార‌థులు హాజ‌ర‌య్యారు. వారిలో ముఖ్యంగా సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి, పృథ్వీరాజ్‌లు ఉన్నారు. వీరిద్ద‌రితో క‌లిసి భావ‌న ప‌లు సినిమాల్లో నటించింది. ఇక హీరోయిన్ల‌లో భావ‌న‌తో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే న‌వ్యా నాయ‌ర్‌, మంజు వారియ‌ర్‌లు పెళ్లిలో ప్ర‌త్యేక ఆక‌ర్షణ‌గా నిలిచారు.

వీరితో పాటు ర‌మ్య నంబీస‌న్‌, శ్రిత శివ‌దాస్‌, షాఫ్నా, స‌య‌నోరా, మృదుల ముర‌ళి వంటి న‌టీన‌టులు పెళ్లిలో సంద‌డి చేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోమ‌వారం రోజున సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ముఖ్యంగా భావ‌న పెళ్లికి విషెస్ చెబుతూ బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన వీడియో నిన్న ట్రెండింగ్‌గా మారింది.



    
bhavan
naveen
marriage
malayalam
mammotty
priyanka chopra

More Telugu News