బాలీవుడ్‌లో మ‌రో ఛాన్స్ కొట్టేసిన మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్‌లో మ‌రో ఛాన్స్ కొట్టేసిన మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్

  • సోన‌మ్ క‌పూర్‌తో న‌టించ‌నున్న ద‌క్షిణాది న‌టుడు
  • అనుజా చౌహాన్ 'ద జోయా ఫ్యాక్ట‌ర్‌' న‌వ‌ల ఆధారంగా చిత్రం
  • దుల్క‌ర్‌కి ఇది రెండో బాలీవుడ్ సినిమా
మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో హిట్ చిత్రాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న దుల్క‌ర్ స‌ల్మాన్‌కి బాలీవుడ్‌లో మ‌రో అవ‌కాశం ల‌భించింది. 2008లో వ‌చ్చిన అనుజా చౌహాన్ న‌వ‌ల 'ద జోయా ఫ్యాక్ట‌ర్‌' ఆధారంగా తెర‌కెక్క‌నున్న చిత్రంలో హీరోగా దుల్క‌ర్‌ని ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ర‌స‌న సోన‌మ్ క‌పూర్ న‌టించ‌నుంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌కి ఇది రెండో బాలీవుడ్ సినిమా. ఇప్ప‌టికే 'క‌ర్వాన్‌' అనే బాలీవుడ్ చిత్రంలో దుల్క‌ర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌న్‌మ‌ర్జియాన్' చిత్రంలో మొద‌ట హీరోగా దుల్క‌ర్ స‌ల్మాన్‌ని అనుకున్నారు. కానీ ఆ స్థానంలో అభిషేక్ బ‌చ్చ‌న్‌ని తీసుకున్నారు. ఇక సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న తెలుగు చిత్రంలో జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ న‌టిస్తున్నాడు. మ‌ల‌యాళంలో ఇటీవ‌ల విడుద‌లైన దుల్క‌ర్ చిత్రం 'సోలో' ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా రుచించ‌లేదు.
dulquer
salman
malayalam
hindi
Bollywood

More Telugu News