Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్కార్ నామినేష‌న్ల‌ను వెల్ల‌డించ‌నున్న ప్రియాంక చోప్రా

  • షూటింగ్ ఫొటోల‌ను షేర్ చేసిన అకాడ‌మీ
  • రేపు వీడియో రూపంలో నామినేష‌న్ల వెల్ల‌డి
  • షూటింగ్‌లో పాల్గొన్న మ‌రికొంతమంది తార‌లు
గ‌తేడాదిలాగే ఈ ఏడాది కూడా ఆస్కార్ల నామినేష‌న్ల జాబితాల‌ను వీడియో రూపంలో విడుద‌ల చేసేందుకు ద అకాడ‌మీ నిర్ణ‌యించుకుంది. ఇందుకోసం షూటింగ్ కూడా ప్రారంభించింది. ఈ నామినేష‌న్లు వెల్ల‌డించే తార‌ల్లో భార‌తీయ న‌టి ప్రియాంక చోప్రాకు కూడా అవ‌కాశం ద‌క్కింది. ఈ నామినేష‌న్ల వీడియో షూటింగ్‌కి సంబంధించి అకాడ‌మీ షేర్ చేసిన కొన్ని ఫొటోల ద్వారా ఈ విష‌యం తెలిసింది.

ప్రియాంక షూటింగ్‌తో పాటు రెబ‌ల్ విల్స‌న్‌, మిషెల్ రోడ్రిగేజ్‌, రొసారియో డాస‌న్‌ల షూటింగ్‌ ఫొటోల‌ను అకాడ‌మీ త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. 2017 ముందు వ‌రకు నామినేష‌న్ల జాబితాను ఎలాంటి అట్ట‌హాసం లేకుండా అకాడ‌మీ విడుద‌ల చేసేది. కానీ గ‌తేడాది నుంచి ఇలా కొంత‌మంది తార‌ల‌ను ఎంపిక చేసి, వారి చేత నామినేష‌న్ల పేర్ల‌ను చ‌దివించిన వీడియోల‌ను రూపొందించ‌డం ప్రారంభించింది. దీని వ‌ల్ల అభిమానుల్లో ఆస‌క్తిని మ‌రింత పెంచే అవ‌కాశం క‌లుగుతుంది. మార్చి 4వ తేదీన ఈ అవార్డుల వేడుక జ‌ర‌గ‌నుంది.
oscar
priyanka chopra
academy

More Telugu News