సీ-ఓటర్ సర్వే ఓ బూటకం.. ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది?: చంద్రబాబు
- ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నాం
- ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశమే లేదు
- కోడి పందేలు ఆడించడానికి ప్రజలు మీకు ఓట్లు వేయలేదు
మరోవైపు, కోడి పందేలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నేతలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కోడి పందేలు అలవాటు లేని ప్రాంతాల్లో కూడా కొందరు వాటిని ప్రోత్సహిస్తున్నారని... ఇది మంచిది కాదని అన్నారు. నాయకులే తలపాగా చుట్టి, కోడి పందేల బరిలోకి దిగడం సరైంది కాదని చెప్పారు. కోడి పందేలు ఆడిస్తారనే భావనతో ప్రజలు మీకు ఓట్లు వేశారా? అని ప్రశ్నించారు. తన మనోభావాలు తెలిసినవారు ఎవరూ అలాంటి పని చేయరని చెప్పారు. అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పైవిధంగా స్పందించారు.