కోహ్లీకి మద్దతు పలికిన హర్భజన్ సింగ్
- ఇలాంటి సమయంలో అండగా నిలబడాలి
- ఓటమి నుంచి ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలి
- మళ్లీ సత్తా చాటుతారనే నమ్మకం ఉంది
ప్రతి ఒక్కరూ మెరుగ్గా ఆడాలనే ప్రయత్నిస్తారని... అయితే, మనం ఊహించిన మేరకు టీమిండియా జట్టు ఆడలేకపోయిందని భజ్జీ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలబడాలని సూచించారు. మన టీమ్ మళ్లీ సత్తా చాటుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. భారత ఆటగాళ్లకు ఈ ఓటమి ఒక గుణపాఠమని... ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ముందుకు సాగాలని తెలిపాడు.