నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ నుంచి జారిపడ్డ ఇనుప రాడ్... కారులోకి చొచ్చుకుపోయిన వైనం
- సురక్షితంగా బయటపడిన డ్రైవర్
- ఎల్ అండ్ టీ నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు
- మలక్పేట్ మెట్రో స్టేషన్ వద్ద ఘటన
'అదృష్టవశాత్తు కారు ముందుభాగంలో పడింది కాబట్టి సరిపోయింది. అదే అద్దం మీద గానీ, రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తి మీద గానీ పడి ఉంటే ఊహించరాని ప్రమాదం జరిగేది. ఈ నిర్లక్ష్య ధోరణికి ఎల్ అండ్ టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది' అని అబ్దుల్ అన్నాడు.
ఈ ప్రమాదంపై స్పందిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదం జరిగినందుకు తాము చింతిస్తున్నామని, ఇది జరగడానికి గల కారణాలను విచారిస్తామని ప్రకటనలో పేర్కొంది. అబ్దుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాదర్ఘాట్ పోలీసులు సెక్షన్ 336 కింద ఎల్ అండ్ టీ మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.