Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రీ షూట్ పెట్టుకున్న సుకుమార్ .. డేట్స్ ఇచ్చిన చరణ్!

  • సంతృప్తి చెందని సుకుమార్ 
  • ఆయన రిక్వెస్ట్ ను కాదనని చరణ్ 
  • మళ్లీ గోదావరి జిల్లాల్లో సందడి    
సుకుమార్ .. చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'రంగస్థలం' చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అయితే సుకుమార్ రీ షూట్ పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో కొన్ని సన్నివేశాలను గోదావరి జిల్లాలలో చేసిన సుకుమార్, ఆ తరువాత అనుకున్నట్టుగా అక్కడ ఎక్కువ రోజులు షూట్ చేయలేమని భావించాడు.

ఆ కారణంగానే హైదరాబాద్ లో ప్రత్యేకమైన భారీ సెట్ వేసి కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. అలా తీసిన సీన్స్ ఇప్పుడు సుకుమార్ కి అంతగా సంతృప్తికరంగా అనిపించడం లేదట. ఈ కారణంగానే ఆయన మళ్లీ గోదావరి జిల్లాల్లో షూటింగ్ పెట్టినట్టుగా సమాచారం. అందుకు చరణ్ కొన్ని డేట్స్ కూడా ఇచ్చాడట. ఈ నెల చివరిలోగా రీ షూట్ పూర్తి చేసి, వచ్చేనెలలో బోయపాటి సినిమా షూటింగులో చరణ్ జాయిన్ అవుతాడన్న మాట.   
sukumar
charan

More Telugu News