ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఇలాంటి పుకార్లు?: అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఇలాంటి పుకార్లు?: అనసూయ

  • ఎక్కువమంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు 
  • చరణ్ కి అత్తగా చేయడం లేదు
  • ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఇలాంటి పుకార్లు  
ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన అనసూయకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి అనసూయ బుల్లితెరపై సందడి చేస్తూనే .. తన వయసుకు తగిన పాత్రలను సినిమాల్లో చేస్తూ వస్తోంది. తాజాగా అభిమానులతో ట్విట్టర్ లో చాట్ చేస్తూ అనేక విషయాలను పంచుకుంది. "ఎందుకని అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు?" అనే ప్రశ్న ఆమెకి ఎక్కువ మంది నుంచి ఎదురైంది.

అందుకామె నవ్వుతూ .. " టైమ్ వస్తే కొన్ని అలా జరిగిపోతూ వుంటాయంతే" అని చెప్పింది. 'రంగస్థలం'లో చరణ్ కి అత్తగా చేస్తున్నారట .. నిజమేనా?" అనే ప్రశ్నకి .. ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటూ సమాధానమిచ్చింది. ఒక యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నారని వార్తలు .. ఏమంటారు?" అనే ప్రశ్న .. ఆమెకి కాస్త కోపాన్ని తెప్పించింది. 'ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఇలాంటి పుకార్లు?' అంటూ అసహనాన్ని ప్రదర్శించింది అనసూయ. 
anasuya

More Telugu News