అత్యాచారాలకు అడ్డాగా హరియాణా.. నాలుగు రోజుల్లో ఆరు కేసులు.. తాజాగా కాలేజీ విద్యార్థినిపై..!
- హరియాణాలో రెచ్చిపోతున్న కామాంధులు
- రోడ్డుపై అమ్మాయి కనిపిస్తే కిడ్నాప్, రేప్
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
జనవరి 13న జరిగిన తొలి ఘటనలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు అనంతరం ఆమెను జింద్‌లోని ఓ కాలువలో విసిరేసి వెళ్లిపోయారు. మరో నిర్భయగా చెబుతున్న ఈ ఘటనలో ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, తనను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన యువకులు ముషైద్‌పూర్ గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తర్వాత తన దుస్తులు కూడా తీసుకున్నారని బాలిక పోలీసులకు తెలిపింది. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పనని ప్రాధేయపడిన తర్వాతే తనకు దుస్తులు ఇచ్చారని వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.