నా కార్యాలయంలో ఐటీ సోదాలు వాస్తవమే : నిర్మాత సి.కల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కార్యాలయంలో ఐటీ సోదాలు వాస్తవమే : నిర్మాత సి.కల్యాణ్

  • కొత్త సినిమా విడుదలైన ప్రతిసారీ ఐటీ అధికారులు వస్తారు
  • సోదాలు జరిగినప్పుడు నేను హైదరాబాద్ లో లేను
  • ‘జై సింహా’ చిత్ర నిర్మాత సి. కల్యాణ్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘జై సింహా’ చిత్ర నిర్మాత సి.కల్యాణ్ కార్యాలయంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ విషయమై కల్యాణ్ స్పందిస్తూ, హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో ఉన్న తన కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన మాట వాస్తవమేనని అన్నారు. కొత్త సినిమా విడుదలైన ప్రతిసారీ ఐటీ అధికారులు వస్తారని చెప్పారు. తన కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగినప్పుడు తాను హైదరాబాద్ లో లేనని మీడియాతో కల్యాణ్ చెప్పారు.
Balakrishna
jai simha

More Telugu News