భార‌త‌ సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి పొంగ‌ల్ జ‌రుపుకున్న కెన‌డా ప్ర‌ధాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార‌త‌ సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి పొంగ‌ల్ జ‌రుపుకున్న కెన‌డా ప్ర‌ధాని

  • జ‌స్టిన్ త్రెదో వేష‌ధార‌ణ‌కు ఫిదా అయిన ఇంట‌ర్నెట్ జ‌నులు
  • త‌మిళంలో పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపిన జ‌స్టిన్‌
  • కెన‌డాలోని త‌మిళుల‌కు వీడియో ద్వారా విషెస్‌
కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో భార‌త‌ సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి థాయ్ పొంగ‌ల్ పండ‌గ జ‌రుపుకున్నారు. త‌మిళ సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించేలా ఉన్న ఆయ‌న వేష‌ధార‌ణ‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా పండ‌గ శుభాకాంక్ష‌లు కూడా ఆయ‌న త‌మిళంలో చెబుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఓ వీడియో మెసేజ్ ద్వారా కెన‌డాలో ఉన్న త‌మిళుల‌కు ప్ర‌త్యేకంగా విషెస్ తెలిపారు.

టొరంటో మేయ‌ర్ జాన్ టోరీతో క‌లిసి పొంగ‌ల్ సంద‌ర్భంగా చేసే సంప్ర‌దాయ వంట‌కాల‌ను ప్రధాని ట్రూడో రుచి చూశారు. అలాగే ఈ నెల‌ను త‌మిళ్ హెరిటేజ్ నెల‌గా జ‌రుపుకోబోతున్నట్లుగా వెల్ల‌డించారు. కెన‌డా అభివృద్ధిలో త‌మిళులు ప్ర‌త్యేక పాత్ర పోషిస్తున్నార‌ని ప్రధాని కొనియాడారు.
Canada
justin treadu
pongal
tamil

More Telugu News