నారావారి పల్లెలో నాగుల పూజ చేసిన చంద్రబాబు
Add ap7am to your home Screen

నారావారి పల్లెలో నాగుల పూజ చేసిన చంద్రబాబు

  • సంప్రదాయం ప్రకారం నాగుల కట్టకు పూజలు
  • తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళి
  • చిన్ననాటి మిత్రులతో గడిపిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబసభ్యులతో కలసి సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఉదయం 10.40 గంటలకు నాగులమ్మ కట్టను దర్శించి, నాగుల పూజ చేశారు. అనంతరం తల్లిదండ్రుల సమాధులను సందర్శించి, నివాళులర్పించారు. చంద్రబాబు రాకతో నారావారిపల్లెలో సందడి నెలకొంది. తన బంధువులు, చిన్ననాటి స్నేహితులతో కలసి ఆయన హుషారుగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య కూడా నారివారిపల్లెలోనే సంక్రాంతి జరుపుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ కుమారుడు దేవాన్ష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. 
Chandrababu
naravaripalle

More Telugu News