ఎంపీ బాల్క సుమన్‌ మతి తప్పినట్లు మాట్లాడుతున్నారు: రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంపీ బాల్క సుమన్‌ మతి తప్పినట్లు మాట్లాడుతున్నారు: రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

  • నేను అడుగుతోన్న ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు
  • ప్రతి విమర్శలు చేస్తున్నారు 
  • తెలంగాణకు నిరంతర విద్యుత్ వస్తుందంటే అది కాంగ్రెస్ ఘనతే
  • 2008లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయమే కారణం
టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను అడుగుతోన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బాల్క సుమన్ ప్రతి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో తాను ప్రశ్నించానని దాని గురించి మాట్లాడకుండా మతి తప్పినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

అసలు తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.  2008లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉందని, 2008లో జంట నగరాల్లో 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇవ్వాలని, అలాగే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అప్పట్లో ఆంధ్ర ప్రాంతానికి 53.89శాతం తెలంగాణకు 46.11శాతం విద్యుత్‌ వినియోగం కేటాయించారని వివరించారు.

2008లో ఇచ్చిన కేటాయింపులతోనే విభజన సమయంలో కేటాయింపులు జరిగాయని, తెలంగాణకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని రేవంత్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ నేతలు ఈ విషయం చెప్పకుండా తమ ఘనతే అన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. 
balka suman
Revanth Reddy
Congress
TRS

More Telugu News