విజయ్ దేవరకొండ హీరోగా హారర్ థ్రిల్లర్ మూవీ!
Add ap7am to your home Screen

విజయ్ దేవరకొండ హీరోగా హారర్ థ్రిల్లర్ మూవీ!

  • గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ 
  • దర్శకుడిగా రాహుల్ 
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు
ఇప్పుడు యూత్ లో విపరీతమైన క్రేజ్ వున్న కథానాయకులలో విజయ్ దేవరకొండ ఒకరుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాల వరకూ వున్నాయి. వీటిలో మూడు సినిమాలు సెట్స్ పై వున్నాయి. మిగతా మూడు సినిమాలు త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాగా ఏది ప్రేక్షకుల ముందుకు రానుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది.

 రాహుల్ దర్శకత్వం వహిస్తోన్న హారర్ థ్రిల్లర్ ఆయన నెక్స్ట్ మూవీ అనే టాక్ వినిపిస్తోంది. గతంలో రాహుల్ 'ది ఎండ్' అనే సినిమాను తెరకెక్కించాడుగానీ, అది పెద్దగా ఆడలేదు. అయితే టేకింగ్ పరంగా ఆయనకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండతో ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తోన్న సినిమాను గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు. ఇది ఆషామాషీ హారర్ థ్రిల్లర్ కాదనీ .. వేసవిలో విడుదలవుతుందని అంటున్నారు.      
vijay devarakonda

More Telugu News