ర్యాంప్ వాక్‌లో దీపిక చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు.. వీడియో చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ర్యాంప్ వాక్‌లో దీపిక చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు.. వీడియో చూడండి

  • ర్యాంప్ మీద ఫ‌న్నీగా న‌డిచిన దీపిక
  • బీఎఫ్ఎఫ్ వోగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న న‌టి
  • స‌ర‌దాగా గ‌డిపిన నేహా ధుపియా, దీపిక, అనీశా
తెర మీదే కాదు.. తెర వెనుక కూడా కొంత‌మంది క‌థానాయిక‌లు సరదాగా అల్ల‌రి ప‌నులు చేస్తుంటారు. అలాంటి ఓ చిలిపి ప‌ని దీపికా పదుకునే చేసింది. సాధార‌ణంగా ర్యాంప్ మీద అందంగా న‌డుస్తూ హొయ‌లొలికిస్తుంటారు. కానీ దీపిక మాత్రం ర్యాంప్ మీద చాలా ఫ‌న్నీగా న‌డిచింది. దీంతో అక్క‌డ ఉన్న వాళ్లంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.

'బీఎఫ్‌ఎఫ్‌ వోగ్‌' కార్యక్రమంలో దీపిక తన సోదరి అనీశా, నటి నేహా ధుపియాతో కలిసి పాల్గొంది. అక్క‌డ నిర్వ‌హించిన ఫ‌న్నీ ఆట‌ల్లో భాగంగా ఆమె ఇలా న‌డిచిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా ప‌దుకునే న‌టించిన 'ప‌ద్మావ‌త్‌' చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత దీపిక ‘సప్నా దీదీ’ బయోపిక్‌లో నటించ‌బోతోంది.
ramp walk
deepika
bff vogue

More Telugu News