నిఖిల్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా కేథరిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిఖిల్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా కేథరిన్

  • 'కిరిక్ పార్టీ' రీమేక్ చేస్తోన్న నిఖిల్ 
  • తదుపరి చిత్రంగా 'కణిథన్' రీమేక్ 
  • ఈ నెల 19వ తేదీన సెట్స్ పైకి
తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి కేథరిన్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. 'ఇద్దరమ్మాయిలతో' .. 'సరైనోడు' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్, తాజాగా నిఖిల్ సరసన నటించడానికి ఓకే చెప్పిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కన్నడ రీమేక్ 'కిరిక్ పార్టీ' షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత 'కణిథన్' అనే తమిళ సినిమా రీమేక్ లో నిఖిల్ నటించనున్నాడు.

తమిళంలో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమా రీమేక్ ను ఈ నెల 19వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కేథరిన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది. ప్రస్తుతం కేథరిన్ తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు తన కెరియర్ కు చాలా హెల్ప్ చేస్తాయని ఆమె భావిస్తోంది.   
nikhil
catherine

More Telugu News