కమల్ సెక్యూరిటీని అమాంతం పెంచేసిన తమిళ సర్కారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమల్ సెక్యూరిటీని అమాంతం పెంచేసిన తమిళ సర్కారు!

  • కీలక నిర్ణయం తీసుకున్న తమిళ సర్కారు
  • దినకరన్ వర్గం నుంచి హాని జరగవచ్చన్న అనుమానం
  • సెక్యూరిటీని రెట్టింపు చేసిన వైనం
విలక్షణ నటుడు కమలహాసన్ భద్రతా సిబ్బందిని భారీగా పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే, శశికళ వర్గం నేత దినకరన్ కు వ్యతిరేకంగా కమల్ పలు వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వర్గం నుంచి కమల్ కు హాని జరుగుతుందన్న ఆందోళనతోనే భద్రతను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో కమల్ కు ప్రైవేట్ సెక్యూరిటీ ఉండగా, ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపిన తరువాత టూ ప్లస్ టూ విధానంలో ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించింది. ఇప్పుడు ఫోర్ ప్లస్ ఫోర్ విధానంలో సెక్యూరిటీ ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఆయన బయటి పర్యటనలకు వెళితే, కార్యక్రమాన్ని బట్టి సెక్యూరిటీని పెంచుతామని తెలిపారు.
Kamal Haasan
Tamil
Security

More Telugu News