దమ్ముంటే రేపు అక్కడికి రండి.. మీ బండారం నేను బయటపెడతా!: పవన్ కల్యాణ్, పూనం కౌర్ లకు మహేశ్ కత్తి ఛాలెంజ్

  • మహేశ్ కత్తిపై హీరోయిన్ పూనం కౌర్ నిన్న తీవ్ర వ్యాఖ్యలు
  • దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్-మహేశ్ కత్తి
  • హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వద్దకు వస్తా
  • రేపు ఉదయం 11 గంటలకు మీరూ రండి
సినీనటుడు పవన్ కల్యాణ్‌కి మద్దతు తెలుపుతూ, సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తిని విమర్శిస్తూ హీరోయిన్ పూనం కౌర్ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే స్థాయిలో మహేశ్ కత్తి కూడా ఆమెపై విరుచుకుపడ్డారు. తాజాగా పవన్ కల్యాణ్, పూనం కౌర్‌లకు ఆయన ఓ సవాల్ విసిరారు.

'మీరో.. నేనో తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్.. మీ బండారం నేను బయటపెడతా.. వస్తారా?' అని అన్నారు. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వద్దకు వస్తానని, దమ్ముంటే తన ముందుకు రావాలని, తాను ఓపెన్ చాలెంజ్ చేస్తున్నానని చెప్పారు.      
Go Back to Shorts
mahesh kathi
Pawan Kalyan
Hyderabad

More Telugu News