రవితేజ న్యూ మూవీ షూటింగ్ ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ న్యూ మూవీ షూటింగ్ ప్రారంభం

  • కల్యాణ్ కృష్ణతో రవితేజ 
  • కథానాయికగా మాళవిక శర్మ 
  • పరిశీలనలో 'నేల టికెట్' టైటిల్  
రవితేజ .. కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుందనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొంతసేపటి క్రితం మొదలైంది. రవితేజ సరసన కథానాయికగా మాళవిక శర్మను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.  

'సోగ్గాడే చిన్నినాయనా' .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో సూపర్ హిట్స్ ను అందుకున్న కల్యాణ్ కృష్ణ, రవితేజతోను ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే చేస్తున్నాడు. రవితేజ స్టైల్ ను జోడిస్తూనే .. తన మార్క్ కథను అల్లుకున్నాడట. ఈ సినిమాతో తనకి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో కల్యాణ్ కృష్ణ వున్నాడు. రీసెంట్ గా రవితేజ పూర్తి చేసిన 'టచ్ చేసి చూడు' తరువాత, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
raviteja
kalyan krishna

More Telugu News