వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాధవన్!
- 'బ్రీత్' పేరుతో త్వరలో రానున్న వెబ్‌సిరీస్
- కొడుకును కాపాడుకునే తండ్రి పాత్రలో మాధవన్
- హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'బ్రీత్' అనే పేరుతో జనవరి 26 నుంచి ఈ వెబ్‌సిరీస్ ప్రసారం కానుంది. ఇందులో కొడుకును కాపాడుకునే తండ్రి పాత్రలో మాధవన్ కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. కొడుకు బతకాలంటే తండ్రి చావాలి... తండ్రి బతకాలంటే కొడుకు చావాలి.. అనే పరిస్థితుల్లో తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటనే ఆసక్తికర అంశాన్ని టీజర్‌లో చూపించి ఆసక్తి కలిగించారు. ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రసారం కానుంది.