కత్తి మహేష్, కోన వెంకట్ ల మధ్య మాటల యుద్ధం!
- జోకర్లు రెచ్చిపోతున్నారన్న కోన
- పవన్ ను ఏబ్రాసీని చేయవద్దన్న కత్తి
- ఇప్పటికే చాలా అయ్యాడంటూ తీవ్ర వ్యాఖ్య
కోన ట్వీట్ కు కత్తి మహేష్ అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. 'ఒక జోకర్ ను మరో జోకర్... ఒక బ్రోకర్ ను మరో బ్రోకర్ సమర్థించుకోవడం సహజమే. చేతకానితనాన్ని మౌనంతో అధిగమించడంలో కొంచమైనా వివేకం ఉంది. మీలాంటి వాళ్లు అనవసరంగా మొరుగుతూ పవన్ కల్యాణ్ ను మరీ ఏబ్రాసిని చేసేయకండి. ఇప్పటికే ఆయన చాలా వరకు అయిపోయాడు' అంటూ ఘాటుగా స్పందించారు. కత్తి కామెంట్ పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.