కొత్త టీవీ ఛానల్, వార్తా పత్రిక ప్రారంభించబోతున్న అన్నాడీఎంకే
- నామ్ అమ్మ, అమ్మ టీవీ అని పేర్లు
- వార్తాపత్రిక ఎడిటర్‌గా మరుధు అలగురాజ్
- గతంలో నమధు ఎంజీఆర్‌కి ఎడిటర్‌గా పనిచేసిన మరుధు
అన్నాడీఎంకే స్థాపకుడు ఎంజీ రామచంద్రన్ జయంతి రోజైన జనవరి 17న గానీ, జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న గానీ ఈ వార్తాపత్రికను ప్రారంభించనున్నట్లు సమాచారం. నామ్ అమ్మ పత్రికకు ఎడిటర్‌గా మరుధు అలగురాజ్ వ్యవహరించనున్నారు. గతంలో నమధు ఎంజీఆర్ పత్రికకు ఈయన ఎడిటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈ నమధు ఎంజీఆర్ పత్రికను శశికళ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు.