'సామి' సీక్వెల్ వచ్చేది అప్పుడేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సామి' సీక్వెల్ వచ్చేది అప్పుడేనట!

  • విక్రమ్ .. హరి కాంబినేషన్లో 'సామి 2'
  • కథానాయికగా కీర్తి సురేశ్ 
  • 45 శాతం చిత్రీకరణ పూర్తి 
  • జూన్ 14వ తేదీన విడుదల
విక్రమ్ కెరియర్లో భారీ వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో .. ఆయన కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిన చిత్రాల్లో 'సామి' ఒకటిగా కనిపిస్తుంది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన దగ్గర నుంచి దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన దర్శకుడు హరికి .. విక్రమ్ కి ఉండేదట. అది ఇన్నాళ్లకు కార్యరూపాన్ని ధరించింది. కొంతకాలం క్రితమే 'సామి 2' రెగ్యులర్ షూటింగ్ మొదలుకాగా, ఇప్పటి వరకూ 45 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ లోగా విక్రమ్ 'స్కెచ్' .. 'ధ్రువ నచ్చత్తిరం' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఏడాది తన నుంచి వస్తోన్న ఈ మూడు సినిమాలు తనకి హిట్స్ ను ఇస్తాయనే బలమైన నమ్మకంతో విక్రమ్ వున్నారు.      
vikram
keerti suresh

More Telugu News