గజల్ శ్రీనివాస్ కు మరో షాక్.. 'సేవ్ టెంపుల్' నుంచి సస్పెన్షన్!
- సేవ్ టెంపుల్ ప్రచారకర్త బాధ్యతల నుంచి సస్పెన్షన్
- సంస్థ పేరు అడ్డం పెట్టుకుని ఇటువంటి పనులు చేయొద్దు
- ఇటువంటి వికృత కార్యకలాపాలకు పాల్పడితే సహించబోం
- సేవ్ టెంపుల్ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్‌రావు
ఆలయవాణి రేడియోలో పని చేస్తోన్న ఓ యువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన గాయకుడు, రచయిత గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్ తగిలింది. సేవ్ టెంపుల్‌కు గజల్ శ్రీనివాస్ ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది.
సేవ్ టెంపుల్ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్‌రావు ఈ విషయంపై మాట్లాడుతూ... తమ సంస్థల్లో పనిచేసే స్త్రీలను దేవతల్లా గౌరవిస్తామని అన్నారు. సంస్థ పేరును అడ్డం పెట్టుకుని ఇటువంటి వికృత కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమని తెలిపారు. తమ సంస్థ హైందవ ధర్మం కోసం పనిచేస్తోందని, ఇటువంటి ఘటన జరగడం విచారకరమని అన్నారు.