కవిత పార్టీ 'టీఆర్ఎస్' పేరుకు దిగువన 'అసోసియేషన్'.. ఎందుకు?

Kavitha Announces Telangana Rashtra Sena Party
  • నేడు పార్టీ పేరును ప్రకటించిన కవిత
  • కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ను పోలి ఉన్న కవిత పార్టీ
  • లీగల్ సమస్య రాకుండా ఈ పదాన్ని చేర్చారనే అభిప్రాయాలు
కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' పేరుతో తన పార్టీని ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మునీరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పార్టీ ప్రకటన చేశారు. పాతిక సంవత్సరాల క్రితం తన తండ్రి కేసీఆర్ స్థాపించిన 'టీఆర్ఎస్' అని వచ్చేలా ఆమె తన పార్టీ పేరును ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు.

క్లుప్తంగా కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ను పోలేలా తన పార్టీ పేరు ఉండేలా కవిత చూసుకున్నారు. కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించినప్పటికీ, దాని కింద చిన్న అక్షరాల్లో 'అసోసియేషన్' అని కనిపించింది. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ను పోలిన నేపథ్యంలో లీగల్ సమస్య రాకుండా ఉండేందుకు కింద అసోసియేషన్ అని చేర్చినట్లు తెలుస్తోంది.
Advertisement
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Rashtra Sena
TRS
BRS
KCR
Telangana politics
Association

More Telugu News