Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాధిత యువ‌తితో పాటు ప‌నిమ‌నిషితో.. మీడియా చేతికి గ‌జ‌ల్ శ్రీనివాస్ వికృత‌ చేష్ట‌ల‌ వీడియోలు!

  • గ‌జ‌ల్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్య‌ల‌కు పొంత‌న లేకుండా ఉన్న వీడియో సాక్ష్యం
  • భుజానికి మాత్ర‌మే ఆ యువ‌తి మందు రాసింద‌ని చెప్పిన నిందితుడు
  • వీడియోలో మాత్రం మ‌రోలా దృశ్యాలు
రేడియో జాకీగా ప‌నిచేసే ఓ యువ‌తిని లైంగిక‌ వేధింపుల‌కు గురి చేసిన‌ గాయ‌కుడు, ర‌చ‌యిత గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను పోలీసులు నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌ర్చి చంచ‌ల్ గూడ జైలుకి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో బాధిత యువ‌తి పోలీసుల‌కు ఇచ్చిన వీడియోలు, ఫొటోలు మీడియాకు చిక్కాయి. అందులో బాధిత యువ‌తితో పాటు ప‌నిమ‌నిషితో గ‌జ‌ల్ శ్రీనివాస్ వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతూ ఉన్నట్లు ఉంది.

 త‌న‌ భుజానికి మాత్ర‌మే ఓ యువ‌తి మందు రాసింద‌ని, ఇంకేమీ జ‌ర‌గ‌లేద‌ని గ‌జ‌ల్ శ్రీనివాస్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు వీడియోలలోని దృశ్యాలు  పూర్తి భిన్నంగా ఉన్నాయి. బాధిత యువతి చేసిన ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.  

gazal srinivas
parvathi
videos

More Telugu News