అమెజాన్ ఇండియాలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న జియో ఫీచర్‌ఫోన్
- ధర రూ. 1,745
- కొనాలా? వద్దా? అనే సందిగ్ధంలో వినియోగదారులు
- అధికారిక అమ్మకాల్లో కొనడమే ఉత్తమం
కానీ ప్రస్తుతం అమెజాన్ ఇండియా వెబ్సైట్లో జియో ఫీచర్‌ఫోన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది. గ్యాడ్జెట్ గీక్ బిజినెస్ సొల్యూషన్ అనే సంస్థ ఈ అమ్మకాలను చేపడుతోంది. దీని ధర రూ. 1,745తో పాటు రూ. 49 డెలివరీ ఛార్జీలు అదనం. అయితే అధికారిక అమ్మకాల్లో ఉన్న సదుపాయాలు అమెజాన్‌లో కొనడం వల్ల అందుబాటులో ఉంటాయో లేదోనన్న అనుమానంతో వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక జియో ఫీచర్ ఫోన్ల అమ్మకాలను జియో చేపట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఎదురుచూసి అధికారిక అమ్మకాల్లో కొనడమే ఉత్తమమని విశ్లేషకులు చెబుతున్నారు.