పాకిస్థాన్ కు మోదీ శాపంగా మారారు.. దేశం నాశనమైపోతోంది: ముషారఫ్
- అంతర్జాతీయ సమాజాన్ని మోదీ ప్రభావితం చేస్తున్నారు
- పాక్ ఏకాకిలా మారుతోంది
- మన దౌత్యనీతికి కాలం చెల్లిపోయింది
అంతర్జాతీయంగా పాకిస్థాన్ కు ఏమాత్రమైనా గౌరవం ఉందా? అంటూ ముషారఫ్ సూటిగా ప్రశ్నించారు. పాకిస్థాన్ దౌత్యనీతికి కాలం చెల్లిపోయిందని అన్నారు. అష్కరే తాయిబా ఉగ్ర సంస్థ అనే విషయాన్ని మనం చెప్పడం తప్పని అన్నారు. కుల్ భూషన్ జాదవ్ గూఢచారి కాదని ఇండియా వాదిస్తోందని... అలాంటప్పుడు లష్కరే తాయిబా ఉగ్ర సంస్థ అని మనమెందుకు చెప్పాలని ప్రశ్నించారు. తన హయాంలో పాకిస్థాన్ దౌత్యనీతి దూకుడుగా ఉండేదని చెప్పారు.
లష్కరే తాయిబా, జమాద్ ఉద్దవాలు దేశ భక్తి గల సంస్థలని ఇటీవల ముషారఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల కార్యకర్తలు దేశం కోసం తమ ప్రాణాలను కూడా అర్పించారని ఆయన అన్నారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు కూడా ఆయన మద్దతు పలికారు.