Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీ రాజకీయ ప్రవేశం... ఫన్నీ ట్వీట్లు చేస్తున్న నెటిజన్లు!

  • రాజకీయ నాయకులు సిద్ధంగా ఉండండి!
  • త‌లైవా ఎంట్రీ.. వార్ వ‌న్‌సైడ్‌
  • ఆక‌ట్టుకుంటున్న కామెంట్లు
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌తి చిన్న విష‌యానికి స్పందించే సోష‌ల్ మీడియాలోకం ఊరుకుంటుందా?... త‌మదైన శైలిలో కామెంట్లు, ట్వీట్లు పెట్టి ర‌జ‌నీ వార్త‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. వాటిలో కొన్ని ట్వీట్లు విప‌రీతంగా ఆక‌ట్టుకుని, న‌వ్వుతెప్పిస్తున్నాయి. కొన్ని మీకోసం!

  • ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రాలేదు... రాజ‌కీయాలే ర‌జ‌నీకాంత్‌లోకి వ‌చ్చాయి.
  • ర‌జ‌నీ వ‌చ్చేస్తున్నాడు... మిగ‌తా రాజ‌కీయ నాయ‌కులారా మీ కుర్చీలు జాగ్ర‌త్త‌
  • మామూలు మ‌నుషులు న్యూఇయ‌ర్ రోజు పార్టీకి వెళ్తారు... కానీ ర‌జ‌నీకాంత్ పార్టీ పెడ‌తాడు.
  • ర‌జ‌నీ రాజ‌కీయ‌ప్ర‌వేశం వార్త విని, రాహుల్ గాంధీ బ్యాంకాక్ పారిపోయాడు.
  • ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏ బ‌ట‌న్ నొక్కినా ర‌జ‌నీ పార్టీకే ఓటు ప‌డిపోతుంది.. అది త‌లైవా ప‌వ‌ర్‌
  • శివాజీ చిత్రాన్ని నిజ‌జీవితంలో చూసే అవ‌కాశం త్వ‌ర‌లో రానుంది.
rajnikanth
funny
tweet
netizens

More Telugu News