50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'
- ఈ నెల 21న విడుదలైన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'
- తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూకుడు
- నైజామ్ లోను రికార్డు స్థాయి వసూళ్లు
తొలి రోజున మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా .. ఆ తరువాత అది హిట్ టాక్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్ము రేపేస్తోంది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 18 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. మరో 5 కోట్ల వరకూ ఈజీగా లాగేస్తుందని అంటున్నారు. ఇక మొత్తంగా ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమా 51.20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందనేది ట్రేడ్ వర్గాల మాట. కథా కథనాలతో పాటు నాని .. సాయిపల్లవి .. భూమిక ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారనీ, అందువల్లనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.