ప్రాక్టీస్‌లో త‌లమున‌క‌లయిన విరాట్ కోహ్లీ.. వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రాక్టీస్‌లో త‌లమున‌క‌లయిన విరాట్ కోహ్లీ.. వీడియో!

  • వ‌చ్చేనెల 5 నుంచి ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టుతో టెస్టు సిరీస్
  • మూడు టెస్టులు ఆడనున్న ఇరు జట్లు
  • ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న విరాట్ కోహ్లీ
వ‌చ్చేనెల 5 నుంచి ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టుతో టీమిండియా టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికా చేరుకున్న విరాట్ కోహ్లీ సేన మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించింది. విరాట్ కోహ్లీ మైదానంలో చెమటోడుస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా కూడా పాల్గొన్నాడు. వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోన్న టీమిండియా చాలా బలంగా ఉంది. కాగా, సొంత గడ్డపై దకిణాఫ్రికాను ఓడించడం అంత తేలికేంకాదు. ప్రస్తుతం ఇరు జట్లు ఐసీసీ వన్డే, టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటిరెండు స్థానాల్లో ఉన్నాయి. 
India
south africa
Virat Kohli

More Telugu News